కాగజ్‌నగర్ పట్టణంలో పుట్టగొడుగుల వలే ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయని డీవైఎఫ్ఐ నాయకులు ఆరోప
ించారు. గురువారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాకు వారు వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణాలు జరుగుతున్నా జిల్లా వైద్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం లేదన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో డీవైఎఫ్ఎ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టీకానంద్, కార్తీక్ ఉన్నారు.