కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 18 పరీక్ష కేంద్రాల వద్ద ఈనెల 17, 18 తేదీలలో గ్రూప్-3 రాత పరీక్షల కారణంగా బీఎన్ఎన్ఎస్-163 సెక్షన్ విధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష సెంటర్ల వద్ద నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమి కూడవద్దన్నారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.