విధులపట్ల నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడిని విధుల నుండి తొలగిస్తూ ఉట్నూరు ఐటిడీఎ ప్రాజెక్ట్ అధికారిణి ఖుష్బూ గుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొమురంభీం జిల్లాలోని వాంకిడి ఆశ్రమ పాఠశాల (బాలికల)లో ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని, నియమించిన ఎంక్వయిరీ కమిటీ ఆధారంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ను ఐటీడీఏ పీఓ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.