కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు దగ్గర కాకతీయ మెస్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువలో మంచినీటి పైప్ లైన్ ఉండడంతో మురికి కాలువ నీరు పైపులైన్లో చేరి నీరు కలుషితం అవుతుందని, దీని ద్వారా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం కాలనీవాసులు కోరుతున్నారు.