వైరా మండలం విప్పలమడకలోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి సామగ్రి దగ్ధమైంది. ఒక్కసారిగా డెకరేషన్ క్లాత్లకు మంటలు అంటుకున్నాయి. చర్చి మొత్తానికి మంటలు వ్యాపించి, ఫ్యాన్లు, బీరువాలు, కుర్చీలు, ట్యూబ్ లైట్లు, కిటికీలు, బల్లాలు దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రూ. 6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు చర్చి నిర్వాహకులు తెలిపారు.