కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో మండల కార్యదర్శి బొల్లా రామస్వామి ఆధ్వర్యంలో వందేళ్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వ నమోదు-2025 కార్యక్రమాన్ని ఆదివారం సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు ప్రారంభించారు. మారిన రాజకీయ పరిస్థితులు, పాలకుల తీరు కమ్యూనిస్టుల అవసరాన్ని గుర్తు చేస్తుండగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీని విస్తరిస్తామని వెల్లడించారు. ఈ సందర్బంగా పలువురికి సభ్యత్వం చేయించారు.