ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేంసూరు మండల పరిధిలోని దుద్దిపూడి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన పొరల్లా నరసింహారావు (18) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.