సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా సత్తుపల్లి మండలంలోని 132కేవీ గంగారం సబ్ స్టేషన్ నుంచి దిగువ ప్రాంతాల్లో లైన్ ఏర్పాటు, 11కేవీ లైన్ లో చెట్టుకొమ్మలు తొలగిస్తునందున్న సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని స్థానిక ఏఈ తెలిపారు. మందలపల్లి ఫీడర్ పై లోడ్ తగ్గించేందుకు గట్టుగూడెంలో కొత్త లైన్ ను వేయనున్నారు. దీంతో రామగోవిందాపురం ఫీడర్లో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.