రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఏఎంసీ చైర్మన్ భాగం నీరజదేవి అన్నారు. శుక్రవారం కల్లూరు మండలం వెన్నవెల్లిలో ఐకేపీ గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పొందాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.