ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ళ వద్ద శుక్రవారం మధిర టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుకాణాల ముందు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసిన ఎడల వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ముందస్తుగా హెచ్చరించారు. కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను అనుసరించాలని సూచించారు.