ముదిగొండ గ్రామపంచాయతీ శివారు రాఘవాపురంలో శనివారం జరిగిన కుటుంబ సమగ్ర సర్వేను ఆర్డీవో గరిడి నరసింహారావు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. తప్పులు దొర్లకుండా కులగణనను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సునీత ఎలిజిబెత్, ఆస్ఐలు ఎస్కే వహీదాబేగం, ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.