ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం రాష్ట్ర మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు భాధిత కుటుంబాలను పరామర్శించి అనంతరం ఇటీవల అక్రమ కేసులో జైలుకు వెళ్లిన చింతకాని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.