నగరంలో నామా విస్తృత ప్రచారం

85பார்த்தது
నగరంలో నామా విస్తృత ప్రచారం
ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మంగళవారం నగరంలో విసృతంగా ప్రచారం నిర్వహించారు. మయూరి సెంటర్ వద్ద ఆటో నడిపి ఆటో డ్రైవర్లను ఓట్లు అభ్యర్థించారు. ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత బస్టాండులో ప్రయాణికులను కలిసి ముచ్చటించారు. పలు షాపింగ్ మాల్, వ్యాపార దుకాణాలకు తిరుగుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తనను మరోమారు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி