భద్రాచలం: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
భద్రాచలం పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఓ వివాహిత అదృశ్యమైంది. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఆమె భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.