దుమ్ముగూడెం: కుటుంబ సామాజిక సర్వే ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సామాజిక, ఆర్థిక సర్వే దుమ్ముగూడెం మండలం, బి కొత్తగూడెం గ్రామ పంచాయతీలో శుక్రవారం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీలోని రెండు ఆవాసాలను బ్లాకులుగా విభజించి సర్వే చేపట్టారు. మొదటి విడతగా గ్రామంలోని కుటుంబాలను లెక్కించి, నవంబర్ 6 తేదీ నుంచి కుటుంబాల పూర్తి సమాచారం సేకరించి, ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేస్తామని పంచాయతీ కార్యదర్శి వంశీ కృష్ణ తెలిపారు.