భద్రాచలం: బోధనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి: పీఓ
గిరిజన సంక్షేమ పాఠశాలలతో పాటు గురుకుల విద్యాలయాలలో విద్యా బోధనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ సక్రమంగా కొనసాగేలా ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఆర్సీఓ నాగార్జునరావు, డీడీ మణెమ్మ, ఈఈ తానాజీలతో కలిసి దర్బారు నిర్వహించారు.