దుమ్ముగూడెం మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సోమవారం సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం వంటివి స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.