వైద్య ఆరోగ్యశాఖలో 18 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆశా వర్కర్లు వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఆశా వర్కర్లు సుమారుగా 8 గంటల పాటు పని చేస్తుంటే తగిన పారితోషకం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు.