అశ్వాపురం మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిక్షమయ్య ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఎందరో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.