యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)కి తమ పార్టీ వ్యతిరేకం కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం స్పష్టం చేశారు. అయితే దానిని దేశంలో అమలు చేసేందుకు
బీజేపీ ప్రయత్నిస్తున్న విధానాన్ని తాము సమర్ధించబోమని పేర్కొన్నారు. దేశాన్ని యూసీసీ బలోపేతం చేస్తుందని, భారతీయులందరినీ ఏకం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే బలవంతంగా దీనిని అమలు చేసి, సమస్యలను సృష్టించడం సరికాదన్నారు.