కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజునే త్రిపురాసురుడు అనే రాక్షసుడిని ఈశ్వరుడు సంహరించాడు. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖసంతోషాలు లభిస్తాయని హిందువులు నమ్ముతారు. అయితే ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నవంబర్ 15న ఉ. 6:19 గం.కు ప్రారంభమై.. నవంబర్ 16న మ.2:58 గం.కు ముగుస్తుంది.