వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్యే

84பார்த்தது
వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్యే
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దంపతులు బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వేద పండితులు మండపంలో ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி