సిరిసిల్ల: 72. 62 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి: కలెక్టర్

85பார்த்தது
సిరిసిల్ల: 72. 62 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి: కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 72. 62 శాతం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1531 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1, 92, 432 ఇండ్లు సర్వే చేయాల్సి ఉండగా నవంబర్ 17 నాటికి మొత్తం 1, 39, 743 ఇండ్ల సర్వే పూర్తి చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 1154 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1, 44, 972 ఇండ్లకు గాను ఇప్పటి వరకు 1, 02, 521 ఇండ్లు, పట్టణ ప్రాంతాలలో 377 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 47, 460 ఇండ్లకు 37, 222 ఇండ్ల సర్వే పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி