హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్త్రీలను గుర్తించి వారు గుండె సంబంధిత, ఎనిమియా, కోవిడ్ కాంప్లికేషన్స్ పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వసంతరావు అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కాంప్లికేషన్స్ వల్ల ప్రసూతి సమయంలో హార్ట్ ఎటాక్, రక్తస్రావం లాంటివి కనబడుతున్నాయని ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు.