తంగళ్లపల్లి మండలం తాడూర్, బద్దెనపల్లిలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎన్యూమరేటర్ బ్లాక్ చేపడుతున్న సర్వేను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.