ఒకే నెలలో రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు ఓ యువతి సాధించి సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన పొన్నం సింధు అనే యువతి గ్రూపు- 4 ఉద్యోగంతోపాటు బ్యాంక్ ఉద్యోగం సైతం సాధించింది. ఇలా ఒకే నెలలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సింధును ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు అభినందిస్తున్నారు.