వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రామగుండం సింగరేణి వైద్య కళాశాలలో నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీలో పాల్గొని మాట్లాడుతూ వైద్యులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాలను వైట్ కోట్ సెర్మనీ గుర్తు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్ పాల్గొన్నారు.