డిసెంబర్ వరకు ఎన్ సిడి స్క్రీనింగ్ పూర్తి చేసేలా కార్యాచరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో ఎన్ సిడి స్క్రీనింగ్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్ సిడి స్క్రీనింగ్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ రూపొందించి రెండు రోజులలో అందజేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.