సింగరేణి సంస్థ రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాల ఉద్యోగులకు సెంటినరీ కాలనీలో క్వార్టర్ల కేటాయింపుకు బుధవారం సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 185 ఖాళీ క్వార్టర్లకు, ఫ్రెష్ అలాట్మెంట్, చేంజ్ ఆఫ్ క్వార్టర్లకు 69మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 27 మంది ఉద్యోగులు హాజరై 25 మంది క్వార్టర్లను ఎంపిక చేసుకున్నారు. ఎస్ఓటు జీఎం రఘుపతి, పర్సనల్ విభాగాధిపతి సుదర్శనం పాల్గొన్నారు.