పకడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే హౌస్ లిస్టింగ్ లో భాగంగా సర్వే బృందాలు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాయి. ఈనెల 8 వరకు ప్రతి ఎన్యూమరేటర్ తన పరిధిలోని 150 ఇళ్లను చెక్ చేసుకుని స్టిక్కర్ అంటించడం జరుగుతుందని, తరువాత ప్రతిరోజు 10 ఇళ్ల చొప్పున 15 రోజులలో సర్వే పూర్తి చేయాలన్నారు.