కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన మద్దతు ధరపై కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. మంగళవారం ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మద్దతు ధరపై నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉన్నారు.