జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం పెద్దపెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిర్ధారణ శిబిరాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, మార్కెట్ సెక్రటరీ పృధ్వీరాజ్ పాల్గొన్నారు.