గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అవసరమైన వారికి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్న లైన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అల్లిపూర్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది. దాదాపు 130 మంది వ్యాధిగ్రస్తులు శిబిరంకు హాజరయ్యారు.