జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించినట్టు ఈవో రామకృష్ణా రావు తెలిపారు. శ్రీ లలితా ట్రస్ట్ వారిచే 75 రోజులకు గాను 12 హుండీలను లెక్కించగా.. నగదు రూ. 1, 04, 36, 365, విదేశీ కరెన్సీ 75 నోట్లు, మిశ్రమ బంగారం 060 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 3 గ్రాములు ఆదాయం సమకూరింది. పర్యవేక్షణాధికారిగా అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ వ్యవహరించారు.