జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకార వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాచకొండ రోజా రామచంద్రంతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.