బీసీల సమరభేరి సభను విజయవంతం చేయాలని, కుల సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని కౌండిన్య హాల్లో బుధవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకట్ ముదిరాజ్ అన్నారు. ఈనెల 25న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టి. నందగోపాల్, తదితరులు పాల్గొన్నారు.