జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 41 ఫిర్యాదులు, విన్నవించుకోలను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ స్వీకరించారు. వీటిని పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి ఎస్ లత, గౌతమ్ రెడ్డి, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంతరావు, డిఆర్డిఓ రఘువరన్ పాల్గొన్నారు.