తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ పర్యటనలో పాల్గొన్నారు. కాగా ఆయనను ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి వెల్గటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డిలు కలిసి ఒకరి కొకరు కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆనంద, హావభావాల చిత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా, రాష్ట్ర స్థాయి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.