కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం గంగుల కమలాకర్ ను ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. కరీంనగర్లోని గంగుల నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మి నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.