బోయినపల్లి మండలం కొదురుపాక రైతు వేదికలో ఎన్యుమరేటర్స్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సర్వే పక్కాగా ఏ ఒక్క ఇల్లు, వ్యక్తి కూడా తప్పిపోకుండా ప్రభుత్వం జారీ చేసిన బుక్లెట్స్ ఆధారంగా సర్వే చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో హౌజ్ లిస్ట్ పోస్టింగ్ పూర్తయిందని, రేపటి నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన చేపట్టాలని సీఈఓ వినోద్ అన్నారు. ఎంపీడీఓ జయశిల, ఎంఈఓ, ఎంపీఓ, శిక్షణ ఆర్పీలు ఉన్నారు.