విద్యుత్ సరఫరాలో ఈ నెల 23న అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ వెంకట స్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1. 00 గంటల వరకు ఎల్లారెడ్డి టౌన్ , పెద్దరెడ్డి, మత్తమల్ పరిధిలోని 33/11 కేవీ గ్రామాల్లో విద్యుత్ నిలిపి వేయడం జరుగుతోందని, రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతోందని ఏఈ తెలిపారు. విద్యుత్ గృహ, గృహేతర వినియోగదారులు సహకరించాలని కోరారు.