తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. బుధవారం ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ ప్రారంభం అయింది. ఎల్లారెడ్డి 8వ వార్డులో గల కొచ్చెరువును బతుకమ్మల నిమజ్జనం కోసం గత మూడు రోజుల నుంచి సిద్దం చేస్తున్నట్లు స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో చెరువు శుభ్రం చేయడంతో పాటు చెరువు కట్టకు ఇరువైపులా మొలచిన పొదలను క్లీన్ చేశామన్నారు.