ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సోమవారం నియోజకవర్గ రైతులపక్షాన ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నెప్రభాకర్ కు, జహీరాబాద్ మాజీ ఎంపీ. బీబీ. పాటిల్ కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. గత నెల రోజుల నుండి వరికోతలు ప్రారంభ మయ్యాయి, సొసైటీల ద్వారా ప్రభుత్వ ధన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 16 న చైర్మన్లు, అధికారులు ప్రారంభించినప్పటీ, ఇప్పటివరకు వరి ధ్యానం కొనుగోలు చేయలేదన్నారు.