కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 15 కోట్లతో ప్రతిపాదనలు పంపగా. మొదటి విడతగా రూ. 5కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో మరిన్ని నిధులు మంజూరు అవుతాయన్నారు.