ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, షి టీమ్ పోలీసులు మధు, శ్రీను బృందం సూచించారు. ఎల్లారెడ్డి బస్టాండ్ వద్ద బుధవారం షిటీమ్ పోలీసులు ప్రయాణీకులకు, విద్యార్థినీలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్ ఓటిపి చెప్పొద్దన్నారు. పోకిరీలు అమ్మాయిల్ని వేధిస్తే వెంటనే షీటీమ్కు ఫోన్ చేయాలని, డబ్బులు పోగొట్టుకుంటే 1930 కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.