నేత్రపర్వంగా రేణుకాదేవి కళ్యాణ మహోత్సవం

76பார்த்தது
నేత్రపర్వంగా రేణుకాదేవి కళ్యాణ మహోత్సవం
బిక్కనూర్ మండలంలోని పెద్ద మల్లరెడ్డిలో రేణుకాదేవి ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా మంగళవారం రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వేద బ్రాహ్మణ మంత్రోచ్ఛరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ ఉత్సవాలను నిర్వహించారు. కళ్యాణానికి తరలి వచ్చిన భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி