కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రూపు 3 పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా ఎస్పీ సిహెచ్. సింధుశర్మ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆమె వెంట పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.