కామారెడ్డి జిల్లా పిట్లo మండలంలో ఆదివారం ఉదయం74.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు పిట్లం మండల తహసిల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో వర్షాలు భారీగా కురుస్తున్నందున పూరి ఇండ్లలో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని, వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. తడిగా ఉన్న విద్యుత్ వైర్లను, విద్యుత్ స్తంభాలను, బోరు స్విచ్ లను తాకరాదన్నారు.