నిజాంసాగర్ మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం కొరకు మరుగుదొడ్లను అప్పట్లో నిర్మాణం చేపట్టారు. మరుగుదొడ్లు శిధిలావస్థకు చేరుకొని సంవత్సరాలు గడుస్తున్నా గాని అధికారులు పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. మండల స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు విద్యా వనరుల కేంద్రంలో నిర్వహిస్తారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి నూతన మరుగుదొడ్లను నిర్మించి ఉపాధ్యాయుల సమస్యను తీర్చాలని కోరుతున్నారు.