బిచ్కుంద మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు మంగళవారం క్రీడలలో సత్తా చాటి ఔరా అనిపించారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ఉత్సవాలు సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో 12, 13 తేదీలలో క్రీడా పోటీలు నిర్వహించారు. బిచ్కుంద, మద్నూర్ మండలాలలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థినిలు క్రీడా పోటీలలో పాల్గొన్నారు. మొత్తం 18 పాఠశాల విద్యార్థినిలు, ఆరు కళాశాల విద్యార్థినులు ఈ క్రీడా పోటీలలో పాల్గొన్నారు.